![]() |
![]() |

మతపరమైన ఉద్రికత్తతలను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే అభియోగం కింద తమ ముందు నవంబర్ 23, 24 తేదీలలో విచారణకు హాజరు కావాల్సిందిగా కంగనా రనౌత్, ఆమె అక్క రంగోలి చందేల్‌లకు ముంబై పోలీసులు బుధవారం సమన్లు జారీ చేశారు.
ఈ అంశంలో ఆ అక్కాచెల్లెళ్లకు ముంబై పోలీసులు సమన్లు పంపడం ఇది మూడోసారి కావడం గమనార్హం. మొదట అక్టోబర్ 26, 27 తేదీలలో హాజరు కావాల్సిందిగా పోలీసులు వారిని అడిగారు. కానీ వారు హాజరు కాలేదు. ఆ తర్వాత మరోసారి నవంబర్ 9, 19 తేదీలలో తమ ముందుకు రావాలని సమన్లు పంపారు పోలీసులు. అప్పుడూ అక్కాచెల్లెళ్లు పట్టించుకోలేదు.
ఫ్యామిలీలో ఓ పెళ్లి వల్ల బిజీగా ఉన్నాననీ, నవంబర్ 15 తర్వాతే తాను అందుబాటులో ఉంటాననీ పోలీసులకు సమాచారం ఇచ్చింది కంగన. దాంతో ఇప్పుడు మూడోసారి సమన్లు పంపారు ముంబై పోలీసులు. మునావర్ అలీ సయ్యద్ అనే కాస్టింగ్ డైరెక్టర్, ఫిట్‌నెస్ ట్రైనర్ పెట్టిన ఎఫ్ఐఆర్‌లో ఆ అక్కాచెల్లెళ్లు తమ ట్వీట్ల ద్వారా భారత రాజ్యంగాన్ని, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరుస్తూ వచ్చారనీ, ముస్లింల మనోభావాలను దెబ్బతీసేందుకు, హిందువుల, ముస్లింల మధ్య విభేదాలను సృష్టించడానికి ప్రయత్నించారనీ పేర్కొన్నారు.
![]() |
![]() |