![]() |
![]() |

కన్నడ హీరో చిరంజీవి సర్జా లాక్‌డౌన్ టైమ్‌లో హార్ట్ ఎటాక్‌తో హఠాత్తుగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సమయానికి ఆయన భార, నటి మేఘనా రాజ్ గర్భవతి. భర్త నిలువెత్తు కటౌట్ పక్కన పెట్టుకొని మేఘన జరుపుకున్న సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత నెలలు నిండి మేఘన పండంటి కుమారుడికి జన్మనిచ్చారు. ప్రసవానంతరం ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.
అయితే లేటెస్ట్‌గా మేఘనతో పాటు చిన్నారి బాబుకు కూడా కరోనా సోకడం కలవరపాటుకు గురిచేస్తోంది. తమకు కొవిడ్ సోకిన విషయాన్ని మేఘన స్వయంగా తెలియజేశారు. తన తల్లిదండ్రులకు కూడా ఆ మహమ్మారి సోకిందనీ, అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదనీ ఆమె చెప్పారు. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఓ నోట్‌లో, "హలో.. మా అమ్మానాన్నలు, నాకు, నా చిన్నారికి కొవిడ్ సోకినట్లు టెస్ట్‌లో నిర్ధారణ అయ్యింది. కొద్ది వారాలుగా మాతో సన్నిహితంగా మెలగిన వారందరూ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నా. చిరు ఫ్యాన్స్ కానీ, నా ఫ్యాన్స్ కానీ భయపడాల్సిన పనిలేదు. అందరం బాగానే ఉన్నాం. చికిత్స తీసుకుంటున్నాం. జూనియర్ చిరు బాగానే ఉన్నాడు, ప్రతి క్షణం తన దగ్గరే ఉండేలా చేస్తున్నాడు. ఓ కుటుంబంగా కరోనా వైరస్‌తో పోరాడి, దాన్నుంచి బయటకు వస్తాం." అని ఆమె తెలిపారు.
యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడైన చిరంజీవి సర్జా జూన్ 7న గుండెపోటుతో మృతి చెందారు. అక్టోబర్‌లో మేఘన చిన్నారి బాబుకు జన్మనిచ్చారు. కేవలం రెండు నెలల వయసులోనే ఆ చిన్నారి కరోనా బారిన పడటం బాధాకరమైనా, దాన్నుంచి ఆ చిన్నారితో పాటు మేఘన ఫ్యామిలీ మొత్తం బయటపడుతుందని ఆశిద్దాం.
.jpg)
![]() |
![]() |