![]() |
![]() |

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కి బ్యాంకాక్ అంటే ఎంతో ఇష్టం! ఖాళీ దొరికితే అక్కడికి వెళ్లి కథలు రాసుకుంటారు. 'దేవుడు చేసిన మనుషులు' సినిమాను బ్యాంకాక్ నేపథ్యంలో తీశారు. అదొక్కటే కాదు... తన సినిమాల్లో కొన్ని పాటలు, ఫైట్లు, సన్నివేశాలను బ్యాంకాక్ నేపథ్యంలో తీశారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమా చిత్రీకరణ కోసం బ్యాంకాక్ వెళ్లడానికి రెడీ అవుతున్నారు.
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'ఫైటర్'. ప్రస్తుతానికి ఇది వర్కింగ్ టైటిలే. 'లైగర్' టైటిల్ ఖరారు చేశారని సమాచారం. కొన్ని రోజులు ముంబైలో సినిమా షూటింగ్ చేశారు. త్వరలో ఫారిన్ ఫైటర్లతో కీలకమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడానికి బ్యాంకాక్ వెళుతున్నారని తెలిసింది. అందుకని విజయ్ దేవరకొండ జిమ్ కి వెళుతూ మజిల్డ్ బాడీ బిల్డ్ చేయడం మీద దృష్టి పెట్టారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే కథానాయికగా నటిస్తోంది.
![]() |
![]() |