![]() |
![]() |

ప్రియాంకా చోప్రా 2000 సంవత్సరంలో ప్రపంచ సుందరిగా నిలిచారు. అందాల పోటీలలో దేశానికి కిరీటం తీసుకొచ్చారు. ఆమె తరవాత పదిహేడేళ్లకు ఆ కిరీటం దేశానికి తెచ్చిన ఘనత మానుషీ చిల్లర్‌కి
దక్కుతుంది. అందాల పోటీ ప్రపంచం నుండి రంగుల ప్రపంచంలోకి వచ్చి కథానాయికగా ప్రయాణం ప్రారంభించిన అమ్మాయిల జాబితాలో ఆమె కూడా చేరారు.
అక్షయ్ కుమార్ హీరోగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న చారిత్రక చిత్రం 'పృథ్వీరాజ్'లో మానుషీ చిల్లర్ నటిస్తున్నారు. నటి కావాలనే తన కల నెరవేరిందనీ, దర్శక ధీరుడు రాజమౌళి దృష్టిలో పడటమే ప్రస్తుతం తన ముందున్న తన కోరిక అని మానుషీ చిల్లర్ చెబుతున్నారు.
"నేను రాజమౌళికి వీరాభిమానిని. పాత్ బ్రేకింగ్ ఫిల్మ్స్ తీశారు. 'బాహుబలి', 'మగధీర' నా ఫేవరేట్ సినిమాలు. ఎన్నిసార్లైనా ఆ సినిమాలు చూస్తా. ఆయన దృష్టిలో పడేలా కష్టపడి పని చేయాలని
అనుకుంటున్నాను. 'బాహుబలి' చూసి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే అటువంటి సినిమాల్లో భాగం కావాలని అనుకున్నాను. భవిష్యత్తులో అటువంటివి చేయాలని అనుకుంటున్నాను" అని మానుషీ చిల్లర్ అంటున్నది.
![]() |
![]() |