![]() |
![]() |

కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఏడు నెలలకు పైగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో దేశంలోని ఫిల్మ్ ఇండస్ట్రీ స్తంభించిపోయిన విషయం తెలిసిందే. మొత్తానికి కేంద్రం లాక్‌డౌన్ ఎత్తేసి, షూటింగ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినీ, టీవీ పరిశ్రమల్లో క్రమంలో కోలాహలం కనిపిస్తోంది. ఒక్కొక్క సినిమా యూనిట్ షూటింగ్‌లను మొదలు పెడుతూ వస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా.. అన్ని భాషల చిత్రసీమల్లోనూ ఈ హడావిడిని మనం గమనిస్తున్నాం. రాజమౌళి సైతం 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ స్టార్ట్ చేసేశాడు.
ఇక బాలీవుడ్‌లో ఇప్పటికే ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్‌కుమార్, కరీనా కపూర్ లాంటి స్టార్లు పనుల్లోకి వచ్చేశారు. ఇప్పుడు వారి సరసన మరో స్టార్ హీరోయిన్ చేరింది. ఆమె.. కత్రినా కైఫ్. గురువారం తను షూటింగ్ స్టార్ట్ చేశానని తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తెలియజేసిన ఆమె ఓ ఫొటోను షేర్ చేసింది. అందులో ఆ సినిమా యూనిట్ మెంబర్స్ ఇద్దరు పీపీఈ కిట్లు ధరించి నిల్చొని ఉండగా, వాళ్లిద్దరి కూర్చొని ఉంది కత్రినా. బ్లాక్ క్రాప్ టాప్, యెల్లో షార్ట్స్‌తో ఎప్పటిలాగే గార్జియస్‌గా ఆమె కనిపిస్తోంది. తక్కువ మేకప్‌తో ఉన్నా అందం ముందు తనముందు ఎవరైనా బలాదూరే అన్నట్లుగా ఉందామె.
![]() |
![]() |