![]() |
![]() |

తెలుగులో నందమూరి కల్యాణ్ రామ్ 'కత్తి', మంచు మనోజ్ 'మిస్టర్ నూకయ్య' సినిమాల్లో నటించిన హీరోయిన్ సనా ఖాన్ గుర్తున్నారా? రంగుల ప్రపంచమైన సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతున్నట్టు సోషల్ మీడియాలో ఆమె ప్రకటించారు. మానవాళికి సేవ చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అందులో పేర్కొన్నారు.
కొన్నేళ్లుగా తాను రంగుల ప్రపంచంలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాననీ... అభిమానుల ఆశీర్వాదంతో కీర్తి ప్రతిష్ఠలు, సంపద లభించాయని సనా ఖాన్ అన్నారు. అయితే, జీవితం యొక్క అసలైన ఉద్దేశం ఏమిటనే అంశం మీద దృష్టి సారించినప్పుడు తన మతం (ఇస్లాం)లో సమాధానం లభించిందని ఆమె తెలిపారు.
"మరణం తరవాత మెరుగైన జీవితం కోసమే ఈ ప్రపంచంలోని ఈ జీవితం. పేరు ప్రఖ్యాతలు, సంపద మాత్రమే కాదు... మానవాళికి సేవ చేసి, పాప ప్రక్షాళన చేసుకోవాలి. సృష్టికర్త చూపిన మార్గాన్ని అనుసరించాలి" అని సనా ఖాన్ పోస్టులో పేర్కొన్నారు.
'మిస్టర్ నూకయ్య' తరవాత తెలుగులో నటించలేదు. హిందీలో 'బిగ్ బాస్' రియాలిటీ షోలో పాల్గొనడం, వివాదాల ద్వారా బోల్డంత క్రేజ్ లభించింది. సల్మాన్ ఖాన్ 'జై హో'లో హోమ్ మినిస్టర్ కుమార్తె పాత్రలో నటించారు. కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్ తో బ్రేకప్ తో వార్తల్లో నిలిచారు.
![]() |
![]() |