![]() |
![]() |

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన 'అనుకోకుండా ఒక రోజు', 'ఒక్కడున్నాడు' చిత్రాలకు కీరవాణి సంగీతం అందించారు. ముచ్చటగా మూడో చిత్రానికి వీళ్లిద్దరూ కలిసి పని చేయాల్సింది. కానీ, కుదరడం లేదని పరిశ్రమ వర్గాల కథనం. నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న సినిమా 'చెక్'. దీనికి సంగీతం అందించాల్సిందిగా మొదట కీరవాణి దగ్గరకు వెళ్లారు. ఆయన ఓకే అన్నారు. అయితే, కరోనా తరవాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బడ్జెట్లు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కీరవాణి వంటి ఖరీదైన సంగీత దర్శకుడిని తీసుకోవడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కనుక ఆయన స్థానంలో 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ శ్రీకర్ అగస్తీని 'చెక్' చిత్రానికి తీసుకున్నారట. 'కేరాఫ్...'లో పాటలు, నేపథ్య సంగీతానికి మంచి పేరు వచ్చింది. అందుకని, కొత్త కుర్రాడికి చంద్రశేఖర్ ఏలేటి అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. 'చెక్'లో పాటలు తక్కువగా ఉన్నప్పటికీ నేపథ్య సంగీతానికి ఎక్కువ అవకాశం ఉందట. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. నెలాఖరుకి దాదాపుగా పూర్తి అవుతుంది.
![]() |
![]() |