![]() |
![]() |

అనుష్క ప్రధాన పాత్ర పోషించిన 'నిశ్శబ్దం' ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికలో విడుదలైంది. మెజారిటీ ప్రేక్షకుల నుండి సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. చాలామంది ఫ్లాప్ అని తేల్చేశారు. ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. గతంలో మంచు విష్ణు హీరోగా అతడు 'వస్తాడు నా రాజు' తీశాడు. అది కూడా ఫ్లాపే.
రెండు ఫ్లాప్ సినిమాలు తీసిన హేమంత్ మధుకర్ కి ఇప్పుడు ఓ కొత్త సినిమా తీసే ఛాన్స్ వచ్చిందని ఇండస్ట్రీ గుసగుస. 'నిశ్శబ్దం'లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన తమిళ హీరో మాధవన్ కి హేమంత్ మధుకర్ వర్కింగ్ స్టైల్ నచ్చిందట. అందుకని, అతడితో మరో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. దర్శకుడికి అభయం ఇచ్చాడని టాక్. అంతేకాదు... హేమంత్ దర్శకత్వంలో సినిమాను తానే స్వయంగా నిర్మించాలని మాధవన్ నిర్ణయించుకున్నారని సమాచారం.
![]() |
![]() |