![]() |
![]() |

ఇటీవల 'సర్కారు వారి పాట' సక్సెస్ సెలబ్రేషన్స్ లో 'మ మ మహేశా' సాంగ్ కి మహేష్ బాబు డ్యాన్స్ వేసిన సంగతి తెలిసిందే. లైవ్ లో స్టేజ్ పై మొదటి సారి మహేష్ మాస్ స్టెప్పులు వేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. తాజాగా వెంకటేష్ కూడా 'F3' సక్సెస్ సెలబ్రేషన్స్ లో మాస్ స్టెప్పులేసి అలరించాడు.
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఎఫ్-3'. మే 27న విడుదలైన ఈ మూవీ మంచి కలెక్షన్స్ రాబడుతూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమా తాజాగా రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిందని తెలుపుతూ.. శనివారం సాయంత్రం వైజాగ్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనిల్, వరుణ్ తో కలిసి వెంకీ మామ చిందేశాడు.
సుమన్ హీరోగా నటించిన 'చిన్న అల్లుడు' సినిమాలోని 'కుర్రాడు బాబోయ్' సాంగ్ ని 'ఎఫ్-3'లో రీమిక్స్ చేసిన విషయం తెలిసిందే. కుర్రాడు బాబోయ్ సాంగ్ కి వెంకీ మామ వేసిన స్టెప్పులకి థియేటర్స్ విజిల్స్ పడ్డాయి. సక్సెస్ మీట్ లోనూ అదే ఎనర్జీతో స్టెప్పులేసి అలరించాడు వెంకటేష్. అనిల్, వరుణ్ తో కలిసి లైవ్ లో స్టేజ్ పై ఆయన వేసిన స్టెప్పులు కన్నుల పండుగలా ఉన్నాయి.
![]() |
![]() |