![]() |
![]() |

'మేజర్' సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. శుక్రవారం(జూన్ 3) విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకునేలా ఉంది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం వరల్డ్ వైడ్ గా రూ.18 కోట్ల బిజినెస్ మేజర్ రెండు రోజుల్లోనే రూ.13.48 కోట్ల షేర్(25.10 కోట్ల గ్రాస్) రాబట్టింది. మొదటి రోజు 7.12 కోట్లు, రెండో రోజు 6.36 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి ఇంకా 5 కోట్ల దూరంలో ఉంది. నేడు ఆదివారం కావడంతో మరో 5-6 కోట్ల షేర్ రాబట్టి బ్రేక్ ఈవెన్ అందుకునే అవకాశముంది.
తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల బిజినెస్ చేసిన మేజర్.. మొదటి రోజు 4.07 కోట్లు, రెండో రోజు 3.61 కోట్ల షేర్ రాబట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రెండు రోజుల్లో 7.68 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. రెండు రోజుల్లో నైజాంలో 3.37 కోట్లు(3.50 కోట్ల బిజినెస్), సీడెడ్ లో 0.87 కోట్లు(2 కోట్ల బిజినెస్), ఆంధ్రాలో 3.44 కోట్లు(4.50 కోట్ల బిజినెస్) రాబట్టింది. వరల్డ్ వైడ్ గా తెలుగు వెర్షన్ 13 కోట్ల బిజినెస్ చేయగా.. రెండు రోజుల్లోనే 12 కోట్లకు పైగా షేర్ వచ్చింది. ఇతర భాషల్లో కోటికి పైగా షేర్ కలెక్ట్ చేసింది.
![]() |
![]() |