![]() |
![]() |

వైవిధ్యానికి పెద్దపీట వేసే ఈ తరం కథానాయకుల్లో అడివి శేష్ ఒకరు. ఒకదానితో ఒకటి పొంతన లేని పాత్రలు చేస్తూ ముందుకు సాగుతున్న ఈ టాలెంటెడ్ యాక్టర్.. తాజాగా `మేజర్`తో పలకరించాడు. వీర సైనికుడు మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ బయోగ్రాఫికల్ యాక్షన్ డ్రామా.. జూన్ 3న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. అంతేకాదు.. మొదటి వారాంతానికే బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. హీరోగా అడివి శేష్ కిది వరుసగా ఐదో విజయం. ఇప్పటికే `క్షణం` (2016), `అమీ తుమీ` (2017), `గూఢచారి` (2018), `ఎవరు` (2019)తో నాలుగు వరుస హిట్స్ అందుకున్న శేష్.. ఇప్పుడు `మేజర్`తో వాటిన్నింటికంటే మెరుగైన ఫలితాన్ని పొంది మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో.. వచ్చే నెల 29న రానున్న అడివి శేష్ తదుపరి చిత్రం `హిట్ః ద సెకండ్ కేస్` పైనే అందరి చూపు ఉంది. 2020 నాటి `హిట్ః ద ఫస్ట్ కేస్`(విశ్వక్ సేన్)కి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమాతో.. శేష్ విజయపరంపర కొనసాగి హీరోగా డబుల్ హ్యాట్రిక్ సొంతమవుతుందేమో చూడాలి. కాగా, నేచురల్ స్టార్ నాని నిర్మించిన `హిట్ః ద సెకండ్ కేస్`కి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు.
![]() |
![]() |