![]() |
![]() |

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి, సూర్య వంటి స్టార్స్ తో కలిసి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ చేసిన ఈ మూవీ యాక్షన్ ప్రియులను అలరిస్తోంది. కమల్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం వరల్డ్ వైడ్ గా రూ.90 కోట్ల బిజినెస్ చేసిన విక్రమ్ మొదటి రోజు 31.20 కోట్ల షేర్(61.13 కోట్ల గ్రాస్), రెండో రోజు 19.60 కోట్ల షేర్(39.13 కోట్ల గ్రాస్) రాబట్టింది. రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 50.80 కోట్ల షేర్(100.26 కోట్ల గ్రాస్)తో సత్తా చాటింది.
రెండు రోజుల్లోనే విక్రమ్ మూవీ 100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడం కమల్ ఫ్యాన్స్ కి సంతోషం కలిగిస్తోంది. ఈ సినిమా తమిళనాడులో 43.05 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 7.46 కోట్లు, కర్ణాటకలో 6.80 కోట్లు, కేరళలో 9.15 కోట్లు, రెస్టాఫ్ ఇండియా 1.70 కోట్లు, ఓవర్సీస్ లో 32.10 కోట్ల గ్రాస్ తో వంద కోట్ల క్లబ్ లో చేరింది.
తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల బిజినెస్ చేసిన విక్రమ్ మొదటి రోజు 1.96 కోట్ల షేర్, రెండో రోజు 2 కోట్ల షేర్ తో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రెండు రోజుల్లో 3.96 కోట్ల షేర్(7.46 గ్రాస్) వసూలు చేసింది.
![]() |
![]() |