![]() |
![]() |

సాయికుమార్ నిర్వహిస్తున్న 'wow 3' మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. ప్రతీ వారం కొంతమంది సెలెబ్రిటీస్ ని తీసుకొచ్చి గేమ్స్ ఆడిస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇక ఈ వారం సీనియర్ యాక్టర్స్ వచ్చి అలరించబోతున్నారు. వాళ్ళు ఎవరంటే ఆమని, పృథ్వీరాజ్, ప్రేమ, దివ్యవాణి. వీళ్ళ నలుగురితో గేమ్స్ ఆడిస్తూ మంచి ఫన్ క్రియేట్ చేశారు సాయికుమార్.
ఇక ఎపిసోడ్లో భాగంగా పృథ్విరాజ్ ని సాయికుమార్ ఒక ప్రశ్న అడుగుతారు 'నీకు హీరోయిన్స్ లో ఎవరు ఇష్టం?' అని.. 'అప్పుడా ఇప్పుడా' అంటూ అడుగుతాడు పృథ్వీ. 'అప్పుడు అంటే ప్రేమ గారు ఇప్పుడు ఆమని గారు' అంటూ నవ్విస్తాడు పృథ్వీ. వెంటనే సాయికుమార్ మూవీ క్విజ్ లో భాగంగా 'మిస్టర్ పెళ్ళాం' సినిమాలో హీరో, హీరోయిన్ కి ఎంత మంది పిల్లలు? అని అడుగుతాడు. వెంటనే ప్రేమ బజర్ నొక్కేసి 'ఫైవ్' అంటుంది.
'ఆ ..అంతమందా ! నాకు పుట్టింది ఇద్దరుగా.. ఇంకో ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారు, మధ్యలో మా ఆయన ఎక్కడికి వెళ్లినట్లు' అని ఆమని మనసులో అనుకుంటోందంటూ సాయికుమార్ చెప్పి స్టేజి మీద నవ్వులు పువ్వులు పూయించారు. ఇక ఈ నెల 7 న ఈటీవీలో ప్రసారం కాబోయే ఈ కిక్ ఇచ్చే గేమ్ షో ప్రోమోని నిర్వాహకులు రిలీజ్ చేశారు.
![]() |
![]() |