![]() |
![]() |

సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేశ్ కి మెమరబుల్ హిట్స్ అందించిన తేదీల్లో ఫిబ్రవరి 18కి ప్రత్యేక స్థానం ఉంది. గతంలో ఇదే తేదిన బ్యాక్ టు బ్యాక్ ఇయర్స్ లో బ్లాక్ బస్టర్స్ అందుకుని వార్తల్లో నిలిచారు వెంకీ.
ఆ వివరాల్లోకి వెళితే.. `నువ్వు నాకు నచ్చావ్` (2001) వంటి సెన్సేషనల్ హిట్ తరువాత కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వెంకీ నటించిన సినిమా `మల్లీశ్వరి`. అందాల తార కత్రినా కైఫ్ టైటిల్ రోల్ లో నటించిన ఈ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా.. 2004 ఫిబ్రవరి 18న జనం ముందు నిలిచింది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ ముంగిట కాసుల జల్లు కురిపించింది.
Also Read: ముంబైలో ఒకేసారి రెండు కొత్త ఫ్లాట్‌లు కొన్న కాజోల్! ధర ఎంతంటే...
కట్ చేస్తే.. ఏడాది తరువాత అంటే 2005లో ఇదే ఫిబ్రవరి 18కి వెంకీ నటించిన మరో సినిమా సందడి చేసింది. ఆ చిత్రమే.. `సంక్రాంతి`. 2001 నాటి కోలీవుడ్ బ్లాక్ బస్టర్ `ఆనందం`కి రీమేక్ గా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో వెంకీకి జోడీగా స్నేహ, ఆర్తి అగర్వాల్ నటించారు. `రాజా` (1999) వంటి సంచలన చిత్రం తరువాత ముప్పలనేని శివ దర్శకత్వంలో వెంకటేశ్ నటించిన ఈ సినిమా కూడా అదే బాట పట్టింది. మొత్తమ్మీద.. అటు విజయ భాస్కర్ తోనూ, ఇటు ముప్పలనేని శివతోనూ వేర్వేరు సంవత్సరాల్లో ఒకే తేదిన (ఫిబ్రవరి 18) సెకండ్ టైమ్ కూడా సెన్సేషనల్ హిట్స్ అందుకున్నారు వెంకీ.
![]() |
![]() |