![]() |
![]() |

శర్వానంద్, రష్మికా మందన్న తొలిసారి జంటగా నటించిన చిత్రం.. ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈనెల 25న భీమ్లా నాయక్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించడంతో, శర్వానంద్ సినిమా విడుదలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తాము కూడా 25నే వస్తున్నామని లేటెస్ట్‌గా నిర్మాతలు తెలిపారు. అంటే భీమ్లా నాయక్‌ను ఢీకొట్టడానికే వారు నిర్ణయించుకున్నారన్న మాట. ఈలోగా ఫిబ్రవరి 19న ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు.
తిరుమల కిశోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన లభించడంతో పాటు ఆడియెన్స్‌లోనూ బజ్‌ను క్రియేట్ అయ్యింది. రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతం కూడా బజ్‌ను మరింత పెంచడానికి సహాయపడుతోంది. ఇప్పటికే విడుదల చేసిన సినిమా టైటిల్ ట్రాక్ , అలాగే వేలంటైన్స్ డే కానుకగా రిలీజ్ చేసిన "ఓ ఆద్య" పాటకు చక్కని స్పందన వచ్చింది.
ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ దక్కించుకోగా, ఈ మూవీ ట్రైలర్‌ను ఫిబ్రవరి 19న విడుదల చేయనున్నట్లు రిలీజ్ చేసిన పోస్టర్‌లో శర్వా తన ఫ్యామిలీతో ఎంత ఆప్యాయంగా ఉంటారో చూపించారు. ఈ పోస్టర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.
కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశి లాంటి సీనియర్ యాక్టర్స్ కలిసి నటిస్తుండడం ఈ సినిమాలో మరో విశేషం. వెన్నెల కిషోర్, రవిశంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోపరాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు ఇతర తారాగణం. సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేశారు.
![]() |
![]() |