![]() |
![]() |

ప్రముఖ మలయాళీ నటుడు, కమెడియన్ ప్రదీప్ కొట్టాయమ్ కన్నుమూశారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటించి మెప్పించిన 61 ఏళ్ల ప్రదీప్ గురువారం ఉదయం గుండెపోటుతో మరణించారు.
ప్రదీప్ కొట్టాయమ్ 40 ఏళ్ల వయసులో 2001లో నటుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆయన ఇప్పటివరకు మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో దాదాపు 80 సినిమాల్లో నటించారు. 'ఏమాయ చేసావే' సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఈ సినిమాలో జెస్సీ అంకుల్ 'జార్జ్' పాత్రలో ప్రదీప్ నటించారు. అలాగే 'రాజా రాణి', 'పోలీసోడు(తేరి)' వంటి సినిమాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించారు.
మలయాళంలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ కొట్టాయమ్ చివరిగా మోహన్ లాల్ మూవీ 'ఆరట్టు'లో నటించారు. ఈ సినిమా రేపు (ఫిబ్రవరి 18న) విడుదలకానుంది. సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు ఆయన కన్నుమూశారు. ప్రదీప్ కొట్టాయమ్ మృతిపై కేరళ సీఎం పినరయి విజయన్, మోహన్ లాల్, ముమ్ముట్టి తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
![]() |
![]() |