![]() |
![]() |

హాస్య నటుడిగా స్టార్ డమ్ చూసిన సునీల్.. కథానాయకుడిగానూ తనదైన ముద్ర వేశారు. మరీముఖ్యంగా.. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు పాత టైటిల్స్ తో సునీల్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ ముంగిట మంచి విజయం సాధించాయి. వాటిలో `పూల రంగడు` ఒకటి. వీరభద్రమ్ చౌదరి డైరెక్ట్ చేసిన ఈ వినోదాత్మక చిత్రంలో టైటిల్ రోల్ లో తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు సునీల్. అలాగే పాటల్లో హుషారైన నృత్యాలతో కనువిందు చేశారు.
Also Read: కుర్ర హీరోతో పోటీ పడలేక పోతున్న రవితేజ!
సునీల్ కి జోడీగా ఇషా చావ్లా నటించిన ఈ సినిమాలో దేవ్ గిల్, కోట శ్రీనివాసరావు, సుమిత్ర, ప్రదీప్ రావత్, అలీ, సత్యం రాజేశ్, పృథ్వీరాజ్, సుధ, ప్రగతి, రఘు బాబు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. అనూప్ రూబెన్స్ బాణీలకు చంద్రబోస్, అనంత శ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి, వనమాలి, కందికొండ సాహిత్యమందించారు. టైటిల్ సాంగ్ తో పాటు ``నువ్వు నాకు కావాలి``, ``నువ్వే నువ్వేలే``, ``చాక్లెట్``, ``ఒక్కడే ఒక్కడే`` వంటి పాటలన్నీ ఎంటర్టైన్ చేశాయి. ఆర్. ఆర్. మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె. అచ్చిరెడ్డి ఈ సినిమాని నిర్మించారు. 2012 ఫిబ్రవరి 18న విడుదలై శతదినోత్సవం జరుపుకున్న `పూల రంగడు`.. నేటితో 10 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |