![]() |
![]() |

(ఫిబ్రవరి 18 కథానాయిక అనుపమ పరమేశ్వరన్ పుట్టినరోజు సందర్భంగా..)
నటిగా కేరళకుట్టి అనుపమ పరమేశ్వరన్ ది ఏడేళ్ళ సినీ ప్రస్థానం. ఈ ప్రయాణంలో 15 చిత్రాల్లో కథానాయికగానూ, రెండు సినిమాల్లో అతిథిగానూ అలరించింది అనుపమ. అంతేకాదు.. మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ ఇలా దక్షిణాది భాషలన్నింటిలోనూ హీరోయిన్ గా సందడి చేసింది మిస్ పరమేశ్వరన్.
Also Read: మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' నుంచి కీలక అప్డేట్!
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. అనుపమ ఏ భాషలో తొలిసారిగా నటించినా విజయం ఖాయమన్నది పరిశీలకుల మాట. తొలుత `ప్రేమమ్` (2015)తో మాతృభాష మలయాళంలో ఎంటర్టైన్ చేసిన అనుపమ పరమేశ్వరన్ కి.. అక్కడ మొదటి ప్రయత్నంలోనే సంచలన విజయం దక్కింది. ఆపై `అ ఆ`(2016)తో తెలుగునాట తొలి అడుగేయగా.. ఇక్కడ కూడా అఖండ విజయం దక్కింది. ఆనక `కొడి` (2016)తో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా.. సేమ్ సీన్ రిపీటయ్యింది.

అనంతరం `నట సార్వభౌమ`(2019)తో కన్నడ చిత్ర సీమలో ప్రవేశించగా.. శాండిల్ వుడ్ లోనూ `ఫస్ట్` హిట్ కొట్టింది అను. అలా.. ఏ భాషలో తొలిసారిగా పలకరించినా.. అనుపమ పరమేశ్వరన్ శుభారంభం చూస్తూనే వచ్చింది. మొత్తమ్మీద.. దక్షిణాది నాలుగు భాషల్లోనూ `మొదటి` ప్రయత్నాల్లో విజయాలు చూసిన అతితక్కువ మంది కథానాయికల్లో ఒకరిగా అనుపమ ప్రత్యేక గుర్తింపు పొందింది.
![]() |
![]() |