![]() |
![]() |

ఈ సంక్రాంతికి 'బంగార్రాజు' సినిమాతో తండ్రి నాగార్జునతో కలిసి అలరించాడు అక్కినేని యువ హీరో నాగ చైతన్య. ఇటీవల 'థ్యాంక్యూ' మూవీ షూటింగ్ పూర్తి చేసిన చైతన్య, తాజాగా కొత్త లుక్ తో దర్శనమిచ్చాడు. దీంతో ఉన్నట్లుండి చైతన్య ఇలా మారడానికి కారణం ఏంటంటూ అక్కినేని అభిమానులు చర్చించుకుంటున్నారు.
తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు పేరు మీద 1,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను నాగార్జున దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. గురువారం జరిగిన అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి ఇతర అక్కినేని కుటుంబసభ్యులతో పాటు చైతన్య కూడా హాజరయ్యాడు. అయితే ఈ కార్యక్రమంలో చైతన్య లుక్ ఆసక్తికరంగా మారింది. ఎప్పుడూ కాస్త గడ్డంతో కనిపించే చైతన్య ఈసారి క్లీన్ షేవ్ తో దర్శనమిచ్చాడు. దీంతో ఏదైనా కొత్త సినిమా కోసం చైతన్య ఇలా మారిపోయాడా అని ఫ్యాన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు.

ఆమిర్ ఖాన్ మూవీ 'లాల్ సింగ్ చద్దా'తో చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో చైతన్య క్లీన్ షేవ్ తోనే కనిపించనున్నాడు. అయితే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేశాడు చైతన్య. దీంతో ఈ తాజా లుక్ మరేదైనా మూవీ కోసం అయ్యుండొచ్చు అంటున్నారు. అయితే ఇది ఓ వెబ్ సిరీస్ కోసమని తెలుస్తోంది. 'థ్యాంక్యూ' డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో కలిసి చైతన్య ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఆ సిరీస్ కోసమే చైతన్య ఇలా మారిపోయి ఉండొచ్చని అంటున్నారు.
![]() |
![]() |