![]() |
![]() |

లేటెస్ట్ జనరేషన్ 'స్పైడర్ మ్యాన్' గా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న టామ్ హోలెండ్ 'అన్ ఛార్టెడ్' అనే హైవోల్టేజ్ యాక్షన్ మూవీలో నటించాడు. ప్రపంచ ప్రఖ్యాత 'అన్ ఛార్టెడ్' అనే వీడియో గేమ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అదే టైటిల్ తో ఫిబ్రవరి 18న థియేటర్లలో విడుదల అవుతుంది.
ట్రెజర్ హంట్ నేపథ్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్ స్టూడియోస్ నిర్మించింది. ఈ సినిమాలో మెజార్టీ యాక్షన్ సన్నివేశాలు కోసం హీరో టామ్ హోలెండ్ ఎలాండి డూబ్ లేకుండా నటించాడు. అంతేకాదు, ఈ సినిమాలో వచ్చే ఓ కీలక యాక్షన్ సన్నివేశం కోసం టామ్ హోలెండ్ ఏకంగా 17 సార్లు కారుతో గుద్దించుకోవాల్సి వచ్చిందట.
స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ తో పాటు, యాక్షన్ సన్నివేశాలు ఇష్టపడే సినీ అభిమానుల్ని అన్ ఛార్టెడ్ అలరించనుంది. ఈ సినిమా ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల అవ్వనుంది. ఇటీవల ఇండియాలో 'స్పైడర్ మ్యాన్:నో వే హోమ్'తో భారీ కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటిన టామ్ హోలెండ్ 'అన్ ఛార్టెడ్'తో ఏ స్థాయిలో అలరిస్తాడో చూద్దాం.
![]() |
![]() |