![]() |
![]() |

రేణూ దేశాయ్ సందర్భం వచ్చినప్పుడల్లా తన మాజీ భర్త పవన్ కల్యాణ్‌ను జ్ఞాపకం చేసుకోవడం మానడం లేదు. ఇప్పుడూ అలాంటి గుర్తు చేసుకొనే సందర్భమే వచ్చింది ఆమెకు. ఆ ఇద్దరూ తొలిసారి కలిసి నటించిన సినిమా 'బద్రి'. అది డైరెక్టర్‌గా పూరి జగన్నాథ్ ఫస్ట్ ఫిల్మ్ కూడా. ఆడియెన్స్‌కు ఆ సినిమా పిచ్చ పిచ్చగా నచ్చేసింది. 'బద్'రి విడుదలై నేటికి సరిగ్గా 20 సంవత్సరాలు. దీంతో తన సోషల్ మీడియా ఎకౌంట్‌లో ఆ సినిమా సెట్స్‌కు సంబంధించిన ఒక ఫొటోనూ రేణూ దేశాయ్ షేర్ చేశారు. అందులో ఎండిపోయిన ఒక చెట్టు మానుపై చెరో పక్కన కూర్చొని, ఎవరికి వాళ్లు ఆలోచనలో మునిగినట్లు కనిపిస్తున్నారు పవన్, రేణు.
"ఈ పిక్చర్ ఒక రోజు షూటింగ్‌కు ప్యాకప్ చెప్పిన తర్వాత తీసింది. 'చికిత' సాంగ్‌లో కల్యాణ్ గారు తన భాగం చిత్రీకరణలో పాల్గొంటే, నేను శాడ్ సాంగ్ 'వరమంటే' షూటింగ్‌లో పాల్గొన్నాను. ఇద్దరం బాగా అలసిపోయాం. కారణం ఆ లొకేషన్‌లో ఎక్కువ సేపు నడవాల్సి రావడం, ఎండ మండిపోతూ ఉండటం. దాంతో అలసట, ఆకలి కారణంగా ఎవరి లోకంలో వాళ్లు ఉండిపోయాం" అని ఆమె రాసుకొచ్చారు. మొత్తానికి విడిపోయి, ఎవరి బ్రతుకు వాళ్లు బ్రతుకుతున్నప్పటికీ, తన మాజీ భర్తను గుర్తు చేసుకుంటూ, ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ వస్తున్నారు రేణు.
![]() |
![]() |