![]() |
![]() |

తెలుగు సినిమా కార్మికుల సంక్షేమం కోసం మెగాస్టర్ చిరంజీవి అధ్యక్షతన ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)కి స్టార్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్ రెండు లక్షల రూపాయలు, తమన్నా భాటియా మూడు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. స్పెషల్ సాంగ్ చేస్తే మినిమమ్ 50 లక్షలు, సినిమాకి కోటి నుండి కోటిన్నర వరకు తీసుకునే కాజల్, తమన్నాకు రెండేసి, మూడేసి లక్షలు ఇవ్వడం పెద్ద విషయం కాదు. అయితే వీరిద్దరి కంటే లావణ్యా త్రిపాఠీ, ప్రణీత సుభాష్ బెటర్. తమకు వచ్చే పారితోషికం తక్కువైనా త్వరగా స్పందించి, మిగతా హీరోయిన్లు కంటే ముందుగా విరాళాలు ప్రకటించారు. ప్రణీత స్వంత ఫౌండేషన్ ద్వారా సహాయం చేస్తుండగా, సీసీసీకి లావణ్య విరాళం ఇచ్చారు. ఢిల్లీలో మురికివాడల్లో ప్రజలకు రకుల్ ఫ్యామిలీ భోజనాలు పెడుతోంది. హీరోయిన్లు అందరి కంటే నయనతార ఎక్కువ విరాళం ఇచ్చారు. ఆమె 20 లక్షలు 'ఫెఫ్సీ'కి ఇచ్చారు. ఈ ఐదారుగురు సరే... మిగతా హీరోయిన్ల సంగతి ఏంటి?
అనుష్క, సమంత, పూజా హెగ్డే, రాశీ ఖన్నా, త్రిష ఏమయ్యారు? నయనతార అంటే తెలుగు, తమిళ సినిమాలు చేయడం ద్వారా సూపర్ స్టార్ స్టేటస్ అందుకున్నారు. అనుష్క అలా కాదు కదా! తెలుగు వల్లే ఆమెకు ఇంత గుర్తింపు లభించింది. ప్రజలు, సినిమా కార్మికులు కష్టాలు పడుతున్న సమయంలో కొంతైనా విరాళం ఇవ్వలేదా? అక్కినేని కోడలు కావడానికి సమంతకు సహాయపడింది తెలుగు సినిమా. అటువంటి తెలుగు సినిమా కార్మికులకు ఆమె విరాళం ఇవ్వలేదా? భర్త నాగచైతన్య, మామ నాగార్జున ఇస్తే చాలని అనుకున్నారా? పూజా హెగ్డేని స్టార్ చేసింది తెలుగు టాలీవుడ్డే. అటువంటి పరిశ్రమకు ఆమె కూడా విరాళం ఇవ్వలేదు. త్రిష తదితర హీరోయిన్లు కోట్ల రూపాయలు పోగేసుకోవడానికి కారణమైన సినిమా పరిశ్రమకు లక్షల రూపాయలు విరాళాలు ఇవ్వలేకపోవడం శోచనీయం.
![]() |
![]() |