![]() |
![]() |

శ్రీకృష్ణునిగా ఎన్టీ రామారావు, అర్జునునిగా అక్కినేని నాగేశ్వరరావు నటించిన చిత్రం 'శ్రీ కృష్ణార్జున యుద్ధం' (1963). అలనాటి దిగ్దర్శకుడు కె.వి. రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీలో ఓ పాటను చిత్రీకరించేటప్పుడు ఆ పాటను వినిపించే ప్లేబ్యాక్ మెషీన్ చెడిపోయింది. ఆ మెషీన్ లోంచి పాట వినిపిస్తుంటే, ఆ పాటకు తగినట్లు శ్రీకృష్ణ పాత్రధారి ఎన్టీ రామారావు పెదవులు కదల్చాలి. ఆ మెషీన్ రిపేరు ఎప్పటికీ పూర్తవడం లేదు. వెంటనే ఆ సినిమా సహాయ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఓ పని చేశారు. ఎన్టీఆర్ ఎదురుగా నిల్చొని ఆయన పాట పాడగా, షూటింగ్ పూర్తి చేశారు.
తర్వాత ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాటకూ, ఈ పాటతో తీసిన సన్నివేశానికీ పొంతన కుదిరి, ప్లేబ్యాక్ మెషీన్ మీద పాడించి, చిత్రీకరించినట్లే అనిపించింది. ఆ పాటే 'అలిగితివా సఖీ ప్రియా'. ఎన్టీఆర్, ఎస్. వరలక్ష్మిపై ఈ పాటను చిత్రీకరించారు.
![]() |
![]() |