![]() |
![]() |

'ఒరేయ్ బుజ్జిగా' సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారా? చేసే అవకాశాలు ఉన్నాయంటూ కొన్ని రోజులుగా ఫిలింనగర్ సర్కిల్‌లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అయితే... అటువంటిది ఏమీ లేదని దర్శకుడు విజయ్ కుమార్ కొండా కొట్టి పారేశారు. రాజ్ తరుణ్, మాళవికా శర్మ జంటగా ఆయన దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన సినిమా 'ఒరేయ్ బుజ్జిగా'. మార్చి నెలాఖరులో, 25వ తేదీన విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే కరోనా అడ్డు పడింది. 'ఒరేయ్ బుజ్జిగా'తో పాటు 'వి', 'ఉప్పెన', 'నిశ్శబ్దం', 'రెడ్' తదితర సినిమాల విడుదల కూడా వాయిదా పడింది. వీటికి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ నుండి ఆఫర్లు వెళ్లాయి.
రామ్ అయితే తన 'రెడ్'ను ఓటీటీలో విడుదల చేయబోమని, ప్రేక్షకులకు థియేటర్లలో సినిమా చూపిస్తామని చెప్పారు. 'ఒరేయ్ బుజ్జిగా' దర్శకుడు విజయ్ కుమార్ కొండా వెర్షన్ కూడా ఇంచుమించు అలాగే ఉంది. "లాక్ డౌన్ ఎత్తేసి, థియేటర్లు ఓపెన్ చేసే వరకు మేం ఎదురు చూడాలని అనుకుంటున్నాం" అని ఆయన స్పష్టం చేశారు. కొన్ని నెలల పాటు థియేటర్లు ఓపెన్ కావని కొందరు చెబుతున్నారని ఆయనతో అనగా..., "ఏడాది పాటు సినిమా కోసం పని చేశాం. మరికొంత సమయం విడుదల కోసం ఎదురు చూడలేమా?" అని ఆయన అన్నారు.
![]() |
![]() |