![]() |
![]() |

సంక్రాంతి సూపర్‌హిట్ 'అల వైకుంఠపురములో' సినిమాను హిందీ రీమేక్ చేయడం ఫిక్స్. అందులో హీరోగా యంగ్ అండ్ హ్యాండ్సమ్ కార్తీక్ ఆర్యన్ కూడా ఫిక్స్. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హిందీలో సీనియర్ దర్శకుడు డేవిడ్ ధావన్ పెద్ద కుమారుడు, యంగ్ హీరో వరుణ్ ధావన్ అన్నయ్య రోహిత్ ధావన్ డైరెక్ట్ చేయనున్నాడు. మరో ఏడు, ఎనిమిది నెలల వరకు కార్తీక్ ఆర్యన్ బిజీ. తర్వాత ఈ సినిమా పనులు స్టార్ట్ చేయనున్నాడు.
ఈలోపు ఉత్తరాది ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కథలో చిన్న చిన్న మార్పులు చేయడానికి రోహిత్ ధావన్ రెడీ అవుతున్నారు. అయితే, ఆల్రెడీ ఒకసారి హీరోకి అతడు కథ చెప్పారు. ఎలాగో తెలుసా? వీడియో కాల్ ద్వారా! కథ చెప్పేటప్పుడు తెలుగు నిర్మాతలు అల్లు అరవింద్, సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కూడా వీడియో కాల్‌లో ఉన్నారట. ఆల్రెడీ తెలుగులో సినిమా సూపర్ సక్సెస్ సాధించడం, కథ నచ్చడం, యూనివర్సల్ అప్పీల్, ఎమోషన్స్ ఉన్న సినిమా కావడంతో కార్తీక్ ఆర్యన్ యస్ చెప్పాడని సమాచారం. హిందీలోనూ సినిమాను గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేయనున్నాయి.
![]() |
![]() |