![]() |
![]() |

'ఇస్మార్ట్ శంకర్' వంటి కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ కొట్టిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, లేటెస్ట్ ఫిల్మ్ 'రెడ్' రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇదివరకు రామ్‌తో 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' వంటి సినిమాలతో పాటు, సాయితేజ్‌ను ఫ్లాపుల నుంచి బయట పడేసిన 'చిత్రలహరి' సినిమా రూపొందించిన కిశోర్ తిరుమల ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. రామ్ పెదనాన్న స్రవంతి రవికిశోర్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదల కావాల్సి ఉంది. కానీ ప్రస్తుత కల్లోల పరిస్థితుల రీత్యా అనివార్యంగా వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడి, థియేటర్లు తెరుచుకున్నాక ఈ సినిమా విడుదల తేదీలో క్లారిటీ రానున్నది.
అయితే ఈలోగా ఈ సినిమా విడుదల గురించి రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో, ఆన్‌లైన్ పోర్టల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. జూన్‌లో ఈ సినిమా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారని ఒకరు ప్రచారం చేస్తుంటే, థియేటర్లు తెరుచుకున్నప్పటికీ, జనం వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి, థియేటర్లలో రిలీజ్ చేయకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారని ఇంకొకరు ప్రచారం చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్‌తో పాటు తమ చానల్‌లో ముందుగా టెలికాస్ట్ చేయడానికి చాన్స్ ఇస్తే భారీ ఎమౌంట్ ఇస్తామని ఒక పేరుపొందిన శాటిలైట్ చానల్ 'రెడ్' ప్రొడ్యూసర్‌కు ఆఫర్ చేసినట్లు ఆ ప్రచార సారాంశం. అయితే ఈ ప్రచారాల్లో ఎలాంటి నిజం లేదని నిర్మాత సన్నిహిత వర్గాలు తెలిపాయి. సొసైటీలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతే ఈ సినిమా విడుదల విషయంలో నిర్మాత ఒక నిర్ణయం తీసుకుంటారని అవి చెప్పాయి.
![]() |
![]() |