![]() |
![]() |

'మసక్కలీ' సాంగ్ రీమిక్స్ వెర్షన్ 'మసక్కలీ 2.0' మీద సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సహా 'ఢిల్లీ 6' సినిమా కోసం ఆ పాట రాసిన ప్రసూన్ జోషి, సినిమా డైరెక్టర్ రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడియన్స్, ముఖ్యంగా రెహమాన్ అభిమానుల సంగతి అయితే చెప్పనవసరం లేదు. రీమిక్స్ చేసిన తనీష్ బగ్చీని తెగ తిడుతున్నారు. జైపూర్ పోలీసులు అయితే లాక్ డౌన్ సమయంలో బయటకు వస్తే 'మసక్కలీ 2.0' పాటను మళ్లీ మళ్లీ వినిపిస్తామని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పాట వినడం కంటే మరో శిక్ష లేదన్నట్టు సెటైర్ వేశారు. ఈ నేపథ్యంలో ఫేమస్ బాలీవుడ్ ర్యాప్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ బాద్షా తాను చేసిన రీమిక్స్ ఏఆర్ రెహమాన్‌కి నచ్చిందని చెబుతున్నాడు.
రెహమాన్ ఫేవరేట్ దర్శకుడు మణిరత్నం తమిళంలో తీసిన సినిమా 'ఓకే కన్మణి'. తెలుగులో 'ఓకే బంగారం'గా విడుదలైంది. ఈ సినిమాని హిందీలో 'ఓకే జాను'గా రీమేక్ చేశారు. మణిరత్నం దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన షాద్ అలీ హిందీ రీమేక్ డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా 'బొంబాయి' సినిమాలో 'హమ్మ హమ్మ' పాటను బాద్షా రీమిక్స్ చేశారు. ఒక ఈవెంట్ దగ్గర రెహమాన్ తనను పిలిచి 'హమ్మ హమ్మ' రీమిక్స్ వెర్షన్ నచ్చిందని చెప్పారని బాద్షా చెబుతున్నాడు. 'మసక్కలీ 2.0'కి వచ్చినట్టు 'హమ్మ హమ్మ' రీమిక్స్ మీద నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఏమీ లేదు. బ్యాడ్ రీమిక్స్ చేసిన తనీష్ బగ్చీ చాలామందికి టార్గెట్ అయ్యాడు.
![]() |
![]() |