![]() |
![]() |

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న 'పుష్ప' ఫస్ట్ లుక్‌ను బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. అదే రోజు సెకండ్ పోస్టర్ కూడా వచ్చింది. దాని ప్రకారం బన్నీ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ట్రక్ డ్రైవర్‌గా పుష్పరాజ్‌గా నటిస్తున్నాడనే విషయం వెల్లడైంది. బన్నీ లుక్ ఎంతగా ఆకట్టుకుందంటే సోషల్ మీడియా సైట్ ట్విట్టర్‌లో దానికి రికార్డ్ స్థాయి లైక్స్ వచ్చాయి. బన్నీసినిమా పాన్ ఇండియా మూవీగా నిర్మాణమవుతుండటం ఇదే తొలిసారి. అందుకే భిన్న భాషలకు చెందిన పేరు పొందిన నటులను ఈ సినిమా కోసం తీసుకుంటున్నారు.
ఇప్పటికే తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి 'పుష్ప'ను పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌ను చేస్తున్నాడు. అలాగే హీరోయిన్‌గా సంచలన తార రష్మికా మందన్న నటిస్తోంది. కాగా ఫిల్మ్‌నగర్‌లో జరుగుతున్న ప్రచారం ప్రకారం విలన్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సునీల్ శెట్టిని సంప్రదిస్తున్నారు. బాలీవుడ్‌లో కొంత కాలం క్రితం దాకా స్టార్ హీరోగా రాణించిన సునీల్ శెట్టి ఇటీవల విలన్ క్యారెక్టర్లు కూడా చేస్తున్నాడు. రజనీకాంత్ 'దర్బార్'లో విలన్ ఆయనే. 'పుష్ప'లో నటించడం ఖాయమైతే ఇది ఆయనకు రెండో తెలుగు సినిమా అవుతుంది. ఇప్పటికే ఆయన ఒక కీలక పాత్ర చేస్తోన్న 'మోసగాళ్లు' మూవీ సెట్స్‌పై ఉంది. అందులో మంచు విష్ణు హీరో. 'పుష్ప' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
![]() |
![]() |