![]() |
![]() |

'రాక్షసుడు' విజయంతో దర్శకుడు రమేష్ వర్మ మరోసారి వెలుగులోకి వచ్చారు. అంతకు ముందు ఆయన తీసిన 'అమ్మాయితో అబ్బాయి', 'వీర' పరాజయాలు మరుగున పడ్డాయి. 'రాక్షసుడు' విజయం తర్వాత మాస్ మహారాజా రవితేజతో రమేష్ వర్మ ఒక సినిమా ప్రకటించారు. ప్రేక్షకులకు మర్చిపోయారేమో కానీ రవితేజ అభిమానులు మాత్రం 'వీర' కళాఖండాన్ని మర్చిపోలేదు. రవితేజ ఖాతాలో అరివీర భయంకర పరాజయాల్లో ఒకటి ఇచ్చిన ఘనత రమేష్ వర్మకీ దక్కింది. అందుకని, అతడితో సినిమా అనగానే అభిమానులు కంగారు పడ్డారు.
అసలు మేటర్ ఏంటంటే... సొంత కథతో 'వీర' తీసిన రమేష్ వర్మ, ఈసారి రీమేక్ కథతో సినిమా తీయడానికి రెడీ అయ్యాడని టాక్. తమిళంలో అరవింద స్వామి, త్రిష నటించిన 'చతురంగ వెట్టై 2' ఆధారంగా రవితేజ, రమేష్ వర్మ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఫైనాన్సియల్ ప్రాబ్లమ్స్ వల్ల తమిళ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. అయితే... హైదరాబాద్ లో స్పెషల్ షో చూసిన రమేష్ వర్మ, స్క్రిప్ట్-రీమేక్ రైట్స్ తీసుకున్నారట. తెలుగుకు తగ్గట్టు తనదైన శైలిలో మార్పులు చేస్తున్నారట. ఇందులో రవితేజ అమాయకుడిగా, మోసగాడిగా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నారని తెలిసింది.
![]() |
![]() |