![]() |
![]() |

రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియాలో నెటిజన్లు అందరికీ మంచిదో, చెడ్డదో వినోదాన్ని పంచుతూ ఉంటారు. ప్రపంచాన్నంతా గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారినీ ఆయన వదలడం లేదు. దానితోనూ ఆయన చతుర్లాడుతున్నారు. దానిపై సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నారు. నిన్న ఆయన మద్యాన్ని హోమ్ డెలివరీ చేయాల్సిందిగా పాలకులను తనదైన స్టైల్‌లో రిక్వెస్ట్ చేశారు.
"కేసీఆర్, కేటీఆర్, వైఎస్ జగన్‌లకు నా హంబుల్ రిక్వెస్ట్ ఏమంటే, ఎవరైతే బోర్ ఫీలవుతున్నారో, జుట్టు పీక్కుంటున్నారో, పిల్లల్లాగా ఏడుస్తున్నారో, మెంటల్ హాస్పిటల్స్‌లో చేరుతున్నారో, ఫ్రస్ట్రేషన్‌లో పెళ్లాలను ఏ మొగుళ్లు చావబాదుతున్నారో.. వాళ్లకోసం మమతా బెనర్జీ లాగా పెద్ద మనసు చేసుకొని, మాకు చీర్స్ ఇవ్వాలి" అని ట్వీట్ చేశారు వర్మ. దానిని కేటీఆర్‌కూ, వైఎస్ జగన్‌కూ ట్యాగ్ చేశారు. జగన్ రిప్లై ఇవ్వలేదు కానీ, కేటీఆర్ ఊరుకుంటారా? రిప్లై ఇచ్చారు.. అదీ తన మార్క్ సెటైర్‌తో...
"రాము గారూ, మీరు మాట్లాడుతోంది జుట్టు కత్తిరించడం (హెయిర్ కట్స్) గురించే కదా?" అని కేటీఆర్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి ఆర్జీవీ నుంచి ఇంకా ప్రతిస్పందన రాలేదు.
![]() |
![]() |