![]() |
![]() |

2011లో పవన్ కళ్యాణ్ ,జయంత్ సి .పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన తీన్ మార్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నటి అన్నా లెజినోవా. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక సాంగ్ లో నటించిన ఆమె పవన్ తో ప్రేమలో పడిపోవటం ఆ తర్వాత ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవడం చక చకా జరిగిపోయాయి. తాజాగా అన్నా లెజినోవాకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అన్నా లెజినోవా నిన్న హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్ ని సందర్శించి చిన్నారులతో కలిసి క్రిస్మస్ వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహించింది.ఆ తర్వాత చిన్నారులతో ముచ్చటించి ఎవరు ఏం చదువు తున్నారో తెలుసుకుంది. అలాగే వాళ్ళ ని ఎడ్యుకేషన్ కి సంబంధించి కొన్ని ప్రశ్నలు కూడా వేసి విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టింది. చిన్నారులకి క్రిస్మస్ కానుకలు ఇవ్వడంతో పాటు హోమ్ కి కావలసిన నిత్యావసర సరుకులను కూడా అందచేసింది. అనంతరం ఆమెని హోమ్ నిర్వాహకులు సత్కరించారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్ అన్నా లెజినోవాని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పవన్ కళ్యాణ్ లాగానే అన్నా కూడా సామాజిక సేవ లో ముందుంటారనే విషయం మరోసారి రుజవయ్యిందని కూడా అభిమానులు అంటున్నారు. అన్నా లెజినోవా జన్మతహా క్రిస్టియన్ అనే విషయం అందరికి తెలిసిందే. కాగా పవన్ కి అన్నా కి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
![]() |
![]() |