![]() |
![]() |

తమిళనాట తిరుగులేని కథానాయకుడిగా ముందుకు సాగుతున్నారు విజయ్. తెలుగులోనూ తనకంటూ ఓ ప్రత్యేక మార్కెట్ సొంతం చేసుకున్న విజయ్.. గత ఏడాది `మాస్టర్`తో మెస్మరైజ్ చేశారు. అయితే, ఈ సంవత్సరం వేసవిలో వచ్చిన `బీస్ట్` ఆశించిన విజయం సాధించలేపోయింది. ఈ నేపథ్యంలో.. రాబోయే `దళపతి 66`(వర్కింగ్ టైటిల్) పైనే అతని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. `బృందావనం`, `ఎవడు`, `ఊపిరి`, `మహర్షి` వంటి జనరంజక సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు వంశీ పైడిపల్లి.. తెలుగు, తమిళ భాషల్లో ఈ ద్విభాషా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు ఈ భారీ బడ్జెట్ మూవీని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే, జూన్ 22 విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా తాలుకూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తోందట. అంతేకాదు.. ఓ స్పెషల్ వీడియో గ్లింప్స్ ని కూడా విడుదల చేసే అవకాశముందని టాక్. త్వరలోనే `దళపతి 66` ఫస్ట్ లుక్ పై క్లారిటీ రానుంది.
`దళపతి 66`లో విజయ్ కి జంటగా రష్మికా మందన్న నటిస్తుండగా శ్రీకాంత్, శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, ప్రభు, `కిక్` శ్యామ్, జయసుధ, సంగీత, యోగిబాబు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. 2023 పొంగల్ స్పెషల్ గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ జనం ముందుకు రానుంది.
![]() |
![]() |