![]() |
![]() |

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ 'అశోకవనంలో అర్జున కళ్యాణం'. మే 6 న ఈ సినిమా విడుదల కానుంది. గతేడాది 'పాగల్'తో నిరాశపరిచిన విశ్వక్ సేన్ ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
తాజాగా విడుదలైన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఇందులో 33 ఏళ్ళు వచ్చినా పెళ్లి గానీ అర్జున్ అనే యువకుడి పాత్రలో విశ్వక్ కనిపిస్తున్నాడు. అసలే వయస్సు మీద పడటం, దానికితోడు తన క్యాస్ట్ లో పిల్ల దొరక్కపోవడంతో.. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కి రెడీ అవుతాడు. ఆ పెళ్లికోసం తెలంగాణలోని సూర్యాపేట నుంచి ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాకు వెళ్తాడు అర్జున్. అయితే అంతా సాఫీగా సాగిపోతుంది అనుకున్న టైంలో పెళ్లి ఇష్టంలేదంటూ అమ్మాయి షాక్ ఇస్తుంది. ఇలా ట్రైలర్ కామెడీ, ఎమోషన్ కలగలిసి ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 'స్క్రిప్ట్' అంటూ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ కట్ చేసిన విధానం బాగుంది. ఇక అర్జున్ పాత్రలో విశ్వక్ ఒదిగిపోయాడు. కామెడీని, ఎమోషన్ ని చక్కగా పండించాడు. అలాగే జయ్ క్రిష్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మించిన ఈ సినిమాకి విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించాడు. రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్ గా నటించింది. 'రాజావారు రాణిగారు' డైరెక్టర్ రవికిరణ్ ఈ సినిమాకి కథ అందించడం విశేషం. 'రాజావారు రాణిగారు' సినిమాతో పాటు విశ్వక్ సేన్ నటించిన 'ఫలక్నుమా దాస్' సినిమాకి విద్యాసాగర్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు.
![]() |
![]() |