![]() |
![]() |

గత చిత్రం `అఖండ` (2021)లో అఘోరాగా నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో కనిపించి మెస్మరైజ్ చేశారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న గోపీచంద్ మలినేని డైరెక్టోరియల్ లోనూ కొత్త తరహా లుక్ లో నటిస్తూ బిజీగా ఉన్నారాయన. అంతేకాదు.. ఆపై రాబోతున్న సినిమాలోనూ అదే పంథాని కొనసాగించబోతున్నారట ఈ నందమూరి వారి హ్యాండ్సమ్ హీరో.
ఆ వివరాల్లోకి వెళితే.. `పటాస్`, `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్`, `ఎఫ్ 2`, `సరిలేరు నీకెవ్వరు` వంటి వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి.. త్వరలో బాలయ్య కాంబినేషన్ లో ఓ మూవీ చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రి-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. అంతేకాదు.. ఈ చిత్రం కోసం బాలకృష్ణ ఇప్పటివరకు చేయని పాత్రని సృష్టించామని అనిల్ చెప్పుకొచ్చారు. అలాగే, అభిమానులకు గుర్తుండిపోయేలా బాలయ్య గెటప్ కూడా సరికొత్తగా ఉంటుందని తెలిపారాయన. మరి.. బాలయ్య - అనిల్ ఫస్ట్ కాంబినేషన్ లో రానున్న ఈ భారీ బడ్జెట్ మూవీ బాక్సాఫీస్ ముంగిట ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
కాగా, అనిల్ రావిపూడి తాజా చిత్రం `ఎఫ్ 3` మే 27న రిలీజ్ కానుంది. ఇందులో విక్టరీ వెంకటేశ్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు.
![]() |
![]() |