![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవికి అచ్చొచ్చిన సంగీత దర్శకుల్లో బప్పీలహరి ఒకరు. వీరిద్దరి కాంబినేషన్ లో నాలుగు చిత్రాలు తెరకెక్కగా.. అవన్నీ కూడా మ్యూజికల్ గా మెప్పించాయి. వాటిలో `స్టేట్ రౌడీ` ఒకటి. చిరు, బప్పీలహరి ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమాని మాస్ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్ బి. గోపాల్ తీర్చిదిద్దారు. `ఇంద్ర`(2002)తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరు - బి. గోపాల్ కాంబో.. `స్టేట్ రౌడీ` కోసమే తొలిసారి జట్టుకట్టడం విశేషం. చిరుకి జంటగా రాధ, భానుప్రియ నటించిన ఈ సినిమాలో శారద, రావు గోపాల రావు, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, త్యాగరాజన్, నూతన్ ప్రసాద్, జయమాలిని, జ్యోతిలక్ష్మి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. పరుచూరి బ్రదర్స్ కథ, సంభాషణలు సమకూర్చిన ఈ చిత్రానికి ఎస్. గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Also Read: జూనియర్ ఎన్టీఆర్ కారుకున్న బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించిన పోలీసులు
బప్పీలహరి బాణీలకు సి. నారాయణ రెడ్డి, వేటూరి సుందరరామ్మూర్తి, జొన్నవిత్తుల సాహిత్యమందించారు. ``రాధ రాధ మదిలోన మన్మథ బాధ``, ``చుక్కల పల్లకిలో``, ``వన్ టూ త్రీ ఫోర్``, ``తధిగణ తోం``, `అరె మూతి మీద మీసమున్న``.. ఇలా ఇందులోని పాటలన్నీ అప్పట్లో మాస్ ని ఉర్రూతలూగించాయి. టి. సుబ్బరామిరెడ్డి, పి. శశి భూషణ్ నిర్మించిన `స్టేట్ రౌడీ`.. అప్పట్లో నైజాం ఏరియాలో కోటి రూపాయిలు ఆర్జించి రికార్డు క్రియేట్ చేసింది. 1989 మార్చి 23న విడుదలై మంచి విజయం సాధించిన `స్టేట్ రౌడీ`.. నేటితో 33 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |