![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ సూర్య తాజాగా `ఎదర్కుమ్ తుణిందవన్`తో పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ తమిళ చిత్రం.. బాక్సాఫీస్ ముంగిట ఆశించిన రెస్పాన్స్ ని సొంతం చేసుకోలేకపోయింది. తెలుగుతో సహా ఇతర భాషల్లో `ఈటీ` పేరుతో అనువాదమైన ఈ యాక్షన్ థ్రిల్లర్.. సూర్య ఖాతాలో మరో పరాజయంగా నిలిచే అవకాశముందంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇదిలా ఉంటే, సూర్య చేతిలో ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. `అసురన్` ఫేమ్ వెట్రిమారన్ దర్శకత్వంలో `వాడివాసల్` చేస్తున్న ఈ `గజిని` స్టార్.. ఆపై తన లక్కీ డైరెక్టర్ బాల కాంబినేషన్ లో ఓ ప్రయోగాత్మక చిత్రం చేయబోతున్నాడు. అలాగే, `శౌర్యం` శివ దర్శకత్వంలోనూ ఓ సినిమా కమిట్ అయ్యాడు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. రీసెంట్ గా మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి కాంబినేషన్ లో `భీష్మ పర్వం` వంటి బ్లాక్ బస్టర్ మూవీని రూపొందించిన అమల్ నీరద్ దర్శకత్వంలోనూ సూర్య ఓ చిత్రం చేయబోతున్నాడట. అంతేకాదు.. 1989 నాటి మమ్ముటి మలయాళ చిత్రం `మృగయా` ఛాయలతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని అంటున్నారు. త్వరలోనే సూర్య, అమల్ నీరద్ కాంబో మూవీపై క్లారిటీ రానుంది.
![]() |
![]() |