![]() |
![]() |

మెగా కాంపౌండ్ కి అచ్చొచ్చిన దర్శకుల్లో స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి ఒకరు. ఇప్పటికే ఈ క్యాంప్ లో మూడు సినిమాలు తీశారు సూరి. ఆ మూడు చిత్రాలు కూడా బాక్సాఫీస్ ముంగిట వసూళ్ళ వర్షం కురిపించాయి. ఆ సినిమాలే.. `రేసు గుర్రం`, `ధృవ`, `సైరా.. నరసింహారెడ్డి`.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సురేందర్ రెడ్డి తెరకెక్కించిన `రేసు గుర్రం` (2014) బ్లాక్ బస్టర్ గా నిలవగా.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో జట్టుకట్టిన `ధృవ` (2016) కూడా మంచి విజయం సాధించింది. అలాగే, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో సురేందర్ తీర్చిదిద్దిన `సైరా.. నరసింహారెడ్డి` (2019) కూడా కాసుల వర్షం కురిపించింది.
కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం మెగా కాంపౌండ్ లో మరో సినిమా చేయనున్నారు సురేందర్ రెడ్డి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. ఈ ఏడాదిలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. `యథా కాలమ్.. తథా వ్యవహారమ్..` అనే కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ ని ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ అధినేత రామ్ తాళ్ళూరి నిర్మించనుండగా.. వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. మరి.. ఇప్పటికే మెగా కాంపౌండ్ లో మూడు విజయాలను అందుకున్న సురేందర్ రెడ్డి.. పవన్ తోనూ ఆ పరంపరని కొనసాగిస్తారేమో చూడాలి.
కాగా, సురేందర్ ప్రస్తుతం అక్కినేని అఖిల్ తో `ఏజెంట్` తీస్తున్నారు. మరోవైపు.. `హరిహర వీరమల్లు`తో బిజీగా ఉన్నారు పవన్.
![]() |
![]() |