![]() |
![]() |

అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న స్పై థ్రిల్లర్ 'ఏజెంట్'. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని తాజాగా మేకర్స్ ప్రకటించారు.
'ఏజెంట్' సినిమాని ఆగష్టు 12 న విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ ని విడుదల చేశారు. పోస్టర్ లో అఖిల్ గన్ పట్టుకొని చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమా విడుదలకి ముందు రోజు అఖిల్ సోదరుడు నాగచైతన్య నటించిన సినిమా విడుదల కానుండటం విశేషం. నాగచైతన్య 'లాల్ సింగ్ చద్దా' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో చైతన్య కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ఆగష్టు 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఒక్కరోజు తేడాతో అక్కినేని సోదరుల సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి. రెండు సినిమాలు భారీ స్థాయిలో విడుదల కానున్నాయి. మరి ఈ సినిమాలతో అక్కినేని హీరో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.
![]() |
![]() |