![]() |
![]() |

ప్రస్తుతం తెలుగునాట పాన్ - ఇండియా మూవీస్ హవా సాగుతోంది. టాప్ స్టార్స్ తో పాటు మీడియం రేంజ్ హీరోలు కూడా ఈ తరహా సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ జాబితాలో మరో యంగ్ హీరో చేరనున్నాడని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైనర్మెంట్స్.. యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఓ ప్రాజెక్ట్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోందట. యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథాంశం కావడంతో.. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ పాన్ - ఇండియా మూవీగా ఈ సినిమాని నిర్మించనున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయని సమాచారం. మరి.. ఈ పాన్ - ఇండియా అటెంప్ట్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
Also Read: రాయలసీమలో బాలయ్య 'అఖండ' వంద రోజుల వేడుక
ఇదిలా ఉంటే, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం ఓ బాలీవుడ్ మూవీ చేస్తున్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళిన యాక్షన్ డ్రామా `ఛత్రపతి`(2005)కి రీమేక్ గా తయారవుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ కెప్టెన్ వీవీ వినాయక్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ జనం ముందుకు వచ్చే అవకాశముంది.
![]() |
![]() |