![]() |
![]() |

ప్రస్తుతం హిందీనాట హవా సాగిస్తున్న యువ కథానాయికల్లో కియారా అద్వాని ఒకరు. `అర్జున్ రెడ్డి` బాలీవుడ్ వెర్షన్ `కబీర్ సింగ్`తో సంచలన విజయం అందుకున్న కియారా.. ఈ ఏడాది మూడు ఆసక్తికరమైన చిత్రాలతో పలకరించబోతోంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఈ మూడు సినిమాలు కూడా వరుసగా రెండు నెలల్లో థియేటర్స్ బాట పట్టనున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. 2007 నాటి బాలీవుడ్ మూవీ `భూల్ భులయ్యా` (`చంద్రముఖి`కి హిందీ వెర్షన్)కి సీక్వెల్ గా రూపొందిన `భూల్ భులయ్యా 2` వేసవి కానుకగా మే 20న విడుదల కానుంది. అనీస్ బాజ్మి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ కి జంటగా ఎంటర్టైన్ చేయనుంది కియారా. ఇక జూన్ 10న శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో విక్కీ కౌశల్ కి జోడీగా అభినయించిన `గోవింద నామ్ మేరా` తెరపైకి రానుండగా.. అదే నెల 24 న రాజ్ మెహతా నిర్దేశకత్వంలో వరుణ్ ధావన్ సరసన ఆడిపాడిన `జగ్ జగ్ జియో` రిలీజ్ కానుంది. మరి.. రెండు వరుస నెలల్లో వినోదాలు పంచనున్న ఈ మూడు చిత్రాలతో కియారా అద్వాని ఎలాంటి గుర్తింపుని, ఫలితాలను అందుకుంటుందో చూడాలి.
Also Read: పూజ, మాళవిక, ప్రియాంక సక్సెస్ కొనసాగేనా!?
ఇదిలా ఉంటే, కియారా ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి జతగా ఓ పాన్ - ఇండియా మూవీ చేస్తోంది. సంచలన దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ డ్రామా.. 2023 సంక్రాంతికి సిల్వర్ స్క్రీన్ పైకి రానుందని సమాచారం.
![]() |
![]() |