![]() |
![]() |

సంచలన దర్శకుడు శంకర్ రూపొందించిన బ్లాక్ బస్టర్ మూవీ `ఎందిరన్` (తెలుగులో `రోబో`)లో తొలిసారి జోడీగా కనువిందు చేశారు సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్. కట్ చేస్తే.. దాదాపు 12 ఏళ్ళ తరువాత ఈ ఇద్దరు మరోసారి జట్టుకట్టనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. `డాక్టర్`, `బీస్ట్` చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో రజినీకాంత్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. `తలైవర్ 169` అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందబోతున్న ఈ సినిమాకి కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ బాణీలు అందించనున్నారు. కాగా, ఈ చిత్రంలో రజినీకాంత్ కి జంటగా ఐశ్వర్యా రాయ్ నటించే అవకాశం ఉందని తమిళనాట జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు ఐశ్వర్యతో సంప్రదింపులు కూడా జరుగుతున్నాయని టాక్. త్వరలోనే `తలైవర్ 169`లో ఐశ్వర్య ఎంట్రీపై క్లారిటీ రానున్నది. మరి.. `రోబో` తరువాత సరైన హిట్ లేని రజినీకాంత్.. మరోసారి ఐశ్వర్యా రాయ్ కాంబినేషన్ తోనైనా సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి.
Also Read: మెగాస్టార్‌ను ఢీకొట్టనున్న తమిళ స్టార్ యాక్టర్!
కాగా, ప్రస్తుతం లెజండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందిస్తున్న తమిళ చిత్రం `పొన్నియన్ సెల్వన్`లో నటిస్తోంది ఐశ్వర్యా రాయ్. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ఎపిక్ హిస్టారికల్ ఫిక్షన్ లో నందిని, మందాకిని దేవి అనే రెండు పాత్రల్లో కనిపించబోతోంది ఐష్. తొలి భాగం వేసవిలో రిలీజ్ కానుండగా.. మలి భాగం వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశముందంటున్నారు.
![]() |
![]() |