![]() |
![]() |

తెలుగునాట దాదాపు అగ్ర కథానాయకులందరితోనూ ఆడిపాడిన వైనం.. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సొంతం. అంతేకాదు.. పలు సంచలన చిత్రాల్లో నాయికగా ఎంటర్టైన్ చేసి వార్తల్లో నిలిచిందీ టాలెంటెడ్ యాక్ట్రస్. అలాంటి కాజల్ కి ఫిబ్రవరి 15 ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే.. ఈ రోజే ఆమె కథానాయికగా నటించిన తొలి చిత్రం విడుదలైంది. ఆ సినిమానే.. `లక్ష్మీ కళ్యాణం`.
Also Read: బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ డిటైల్స్
సంచలన దర్శకుడు తేజ రూపొందించిన ఈ చిత్రం కంటే ముందు.. `క్యోం! హో గయా నా` అనే హిందీ సినిమాలో దర్శనమిచ్చినా, అందులో తనది హీరోయిన్ (ఐశ్వర్యా రాయ్) చెల్లెలు పాత్ర. దీంతో.. `లక్ష్మీ కళ్యాణం` రూపంలో కాజల్ కి నాయికగా తొలి అవకాశం దక్కినట్లయ్యింది. అంతేకాదు.. నటనకు ప్రాధాన్యమున్న టైటిల్ రోల్ (లక్ష్మి)లో తనదైన అభినయంతో మురిపించింది కాజల్. మరో విశేషమేమిటంటే.. కాజల్ పాత్రకి ఒకప్పటి కథానాయిక రాశి డబ్బింగ్ చెప్పింది. అలాగే, ఇందులో నందమూరి కళ్యాణ్ రామ్ కి జోడీగా కనువిందు చేసిన కాజల్.. తరువాతి కాలంలో అతని తమ్ముడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి హిట్ పెయిర్ గా నిలవడం ఇంకో విశేషం. కాగా, 2007 ఫిబ్రవరి 15న విడుదలైన `లక్ష్మీ కళ్యాణం`.. నేటితో 15 వసంతాలు పూర్తిచేసుకుంది. అంటే.. కాజల్ టాలీవుడ్ కెరీర్ కి 15 ఏళ్ళు పూర్తయ్యాయన్నమాట.
![]() |
![]() |