![]() |
![]() |

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ క్యాలెండర్ ఇయర్ లో వరుస చిత్రాలతో సందడి చేస్తూ టాక్ ఆఫ్ టాలీవుడ్ అవుతున్నారు. ఇప్పటికే `రౌడీ బాయ్స్`, `గుడ్ లక్ సఖి`, `ఖిలాడి`తో పలకరించిన డీఎస్పీ.. త్వరలో `ఆడవాళ్ళు మీకు జోహార్లు`తో ఎంటర్టైన్ చేయబోతున్నారు. అంతేకాదు.. వేసవిలో మరో రెండు సినిమాలతో అలరించనున్నారీ స్టార్ కంపోజర్. విశేషమేమిటంటే.. ఆ రెండు చిత్రాలు కూడా ఒకే రోజున తెరపైకి రాబోతున్నాయి.
Also read: పోలీసోడి భార్యతో ఎఫైర్.. ఇదేం సంస్కారం?
ఆ వివరాల్లోకి వెళితే.. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందించిన సినిమా `ఎఫ్ 3`. `ఎఫ్ 2`కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ సమ్మర్ స్పెషల్ గా మే 27న రిలీజ్ కాబోతోంది. ఇక అదే రోజున దేవిశ్రీ స్వరాలు అందించిన మరో మూవీ వస్తోంది. ఆ సినిమానే.. `రంగ రంగ వైభవంగా`. ఇందులో మెగా యంగ్ సెన్సేషన్ వైష్ణవ్ తేజ్, `రొమాంటిక్` భామ కేతికా శర్మ జంటగా నటిస్తుండగా.. గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్నారు. మరి.. ఒకే రోజున సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్న ఈ రెండు సినిమాలతో రాక్ స్టార్ డబుల్ ధమాకా హిట్స్ అందుకుంటారేమో చూడాలి.
![]() |
![]() |