![]() |
![]() |

వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ 'గని' రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చింది. ఈ మూవీని ఫిబ్రవరి 25 న థియేటర్స్ లో విడుదల చేయనున్నట్లుగా తెలుపుతూ తాజాగా మూవీ టీమ్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. దీంతో ఫిబ్రవరి 25 న విడుదల కావాల్సిన 'భీమ్లా నాయక్' వాయిదా పడినట్లే అని అర్థమవుతోంది.
ఫిబ్రవరి 25 లేదా మార్చి 4 న 'గని' సినిమాని విడుదల చేస్తామని రెండు వారాల క్రితం మేకర్స్ ప్రకటించారు. దీంతో పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' మూవీ రిలీజ్ డేట్ పై గని విడుదల ఆధారపడి ఉందని అర్థమైంది. ఎందుకంటే 'భీమ్లా నాయక్' ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుందని అప్పటికే ఆ మూవీ టీమ్ ప్రకటించింది. ఒకవేళ 'భీమ్లా నాయక్' ఫిబ్రవరి 25 న వస్తే 'గని' మార్చి 4 కి వెళ్ళేది. కానీ 'గని'నే ఫిబ్రవరి 25 కి వచ్చింది.

భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25 న విడుదల కాదని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లే ఇటీవల 'గని' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో.. భీమ్లా నాయక్ వాయిదాపై క్లారిటీ ఉండటంతోనే 'గని' టీమ్ తొందపడుతుందని అర్థమైంది. ఇక ఇప్పుడు 'గని' ఫిబ్రవరి 25 న విడుదలవుతున్నట్లు అధికారికంగా ప్రకటన రావడంతో.. భీమ్లా నాయక్ వాయిదాపై దాదాపు క్లారిటీ వచ్చేసింది.
![]() |
![]() |