![]() |
![]() |

సూపర్ స్టార్ మహేశ్ బాబుకి 2022 మే ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. ఆ నెలలో మహేశ్ బాబు నుంచి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రాబోతున్నాయి. అది కూడా.. రెండు వారాల వ్యవధిలో.
ఆ వివరాల్లోకి వెళితే.. తను కథానాయకుడిగా నటిస్తూ మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కాంబినేషన్ లో జి. మహేశ్ బాబు ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్ బాబు నిర్మిస్తున్న `సర్కారు వారి పాట` వేసవి కానుకగా మే 12న రిలీజ్ కాబోతోంది. కట్ చేస్తే.. రెండు వారాల తరువాత అంటే మే 27న జి. మహేశ్ బాబు ఎంటర్టైన్మెంట్స్ బేనర్ పై మహేశ్ నిర్మిస్తున్న మరో మూవీ రిలీజ్ కానుంది. ఆ చిత్రమే.. `మేజర్`.
మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్ లో అడివి శేష్ టైటిల్ రోల్ లో కనిపించనున్నాడు. ప్రధానంగా తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్, A+S మూవీస్ సంస్థలతో కలిసి మహేశ్ నిర్మిస్తున్నారు. మరి.. ఒకే నెలలో రెండు వారాల వ్యవధిలో మహేశ్ నిర్మాణంలో రాబోతున్న ఈ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.
![]() |
![]() |