![]() |
![]() |

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'లైగర్'. ధర్మా ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై కరణ్ జోహార్, ఛార్మి నిర్మిస్తున్న ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. అమెరికాలో జరుగుతున్న షెడ్యూల్ లో ఆయన షూటింగ్ లో పాల్గొన్నారు. ఇప్పటికే విజయ్ బాక్సింగ్ లెజెండ్ తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నానని తన సంతోషాన్ని పంచుకోగా.. తాజాగా చార్మి కూడా తమ మూవీలో మైక్ టైసన్ భాగం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది.
షూటింగ్ లొకేషన్ లో 'లైగర్' టీమ్ మైక్ టైసన్ తో కలిసి దిగిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఛార్మి.. 'సూపర్ కూల్ లెజెండ్ మైక్ టైసన్ తో కలిసి 'లైగర్' టీమ్ వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఆయనకు నేను ఫ్యాన్ అయిపోయాను. ఆయన మనిషి ఉక్కు.. మనస్సు బంగారం' అని ట్వీట్ చేసింది. ఛార్మి షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాకి మణిశర్మ, తనిష్క్ బాఘ్చి సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
![]() |
![]() |