Home  »  News  »  'పలాస' హీరో మూడో సినిమా.. క్లాప్ కొట్టిన డైరెక్టర్ మారుతి!

Updated : Nov 16, 2021

'పలాస 1978' సినిమాతో ఆకట్టుకున్న యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'శశివదనే'. గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కోమలీ ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తోంది. 

'శశివదనే' సినిమా మంగళవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హీరో హీరోయిన్ల మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ డైరెక్టర్ మారుతి క్లాప్ కొట్టగా.. మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత శరత్ మరార్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మూవీ లాంచ్ సందర్భంగా హీరో రక్షిత్ మాట్లాడుతూ.. "తేజగారు చాలా ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్. దర్శకుడు సాయి గారికి అద్భుతమైన విజన్ ఉంది. రెహమాన్ గారి శిష్యుడు శరవణ వాసుదేవన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మంచి టీమ్ కుదిరింది. మంచి సినిమా అవుతుంది. 'పలాస' తర్వాత 'నరకాసుర' అనే సినిమా చేస్తున్నాను. దాని తర్వాత ఇది మంచి ప్రేమకథ అవుతుంది. ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మమ్మల్ని ఆశీర్వదించాడానికి వచ్చిన మారుతి గారు, రఘు కుంచె గారు, శరత్ మరార్ గారు... అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు" అని అన్నారు.

హీరోయిన్ కోమలీ ప్రసాద్ మాట్లాడుతూ.. "ఈ ప్రాజెక్ట్ చాలా స్పెషల్. ఈ చిత్రానికి పని చేస్తున్న అందరూ ఒకరికి ఒకరు తెలిసినవాళ్లే. సాయి మోహన్ గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడు... నేరేషన్ స్టార్ట్ చేసిన ఐదు నిమిషాలకు ఓకే చెప్పేశా. నేరేట్ చేస్తుంటే... సినిమా కనిపించింది. తేజ గారు ప్రొడక్షన్ అని తెలిసినప్పుడు ఇంకా హ్యాపీ ఫీలయ్యా. సాంగ్స్ రఫ్ ట్రాక్స్ విన్నాను. చాలా హ్యాపీ" అని అన్నారు.   

నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ.. "మేం ఈ సినిమా టైటిల్ సెప్టెంబర్ లో అనౌన్స్ చేశాం. టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. రక్షిత్ గారు, కోమలి ప్రసాద్ గారి పెయిర్ చాలా బావుంది. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్లకు ఇదే తొలి సినిమా. డిసెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభించడానికి ఎగ్జైటెడ్ గా ఉన్నాం" అని చెప్పారు. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.