![]() |
![]() |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన 'దాక్కో దాక్కో మేక', 'శ్రీవల్లి', 'సామి సామి' సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ నెల 19 న నాలుగో సాంగ్ విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా సాంగ్ ప్రోమోని విడుదల చేశారు మేకర్స్.
'ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా' అంటూ సాగే పుష్ప ఫోర్త్ సింగిల్ ప్రోమో ఆకట్టుకుంటోంది. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ సాంగ్ ని నకాష్ అజీజ్ ఆలపించారు. నకాష్ వాయిస్ పవర్ ఫుల్ గా ఉంది. ఇక ప్రోమోలో బన్నీ లుక్, బాడీ ల్యాంగ్వేజ్ తగ్గేదేలే అన్నట్లుగా ఉన్నాయి. చిన్న ప్రోమోతోనే ఈ సాంగ్ లో బన్నీ పెర్ఫామెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పేశారు. ఈ నెల 19 న వచ్చే ఫుల్ సాంగ్ తో పాటు.. బిగ్ స్క్రీన్ పై పుష్ప రాజ్ సందడి కోసం బన్నీ ఫ్యాన్స్ అంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా, పుష్పలో బన్నీకి జోడీగా రష్మిక మందాన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండు భాగాలుగా విడుదల కాకున్న పుష్ప మూవీ మొదటి భాగం 'పుష్ప ది రైజ్' డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |