![]() |
![]() |

కన్నడ పవర్ స్టార్, దివంగత పునీత్ రాజ్ కుమార్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు కర్నాటక రాష్ట్ర అత్యున్నత పురస్కారమైన 'కర్నాటక రత్న' అవార్డ్ ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ట్విటర్ వేదికగా తెలిపారు.
పునీత్ అక్టోబర్ 29న గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. సినిమా హీరోగా సూపర్ క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా.. ఎన్నో సేవా కార్యక్రమాలతో రియల్ హీరోగా ఆయన ప్రజల గుండెల్లో నిలిచారు. అందుకే రాష్ట్ర అత్యున్నత పురస్కారం అందించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తాజాగా తీర్మానం చేశారు.
దివంగత పునీత్ ని 'కర్నాటక రత్న' అవార్డుతో సత్కరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
![]() |
![]() |