![]() |
![]() |

మలయాళం స్టార్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్ చేసిన 'కురుప్' మూవీ నవంబర్ 12న థియేటర్లలో విడుదలైంది. కేరళలో 505 స్క్రీన్స్‌లో ఈ క్రైమ్ థ్రిల్లర్ రిలీజయింది. వరల్డ్ వైడ్‌గా మొదటిరోజు 2000కు పైగా స్క్రీన్స్‌లో దీన్ని ప్రదర్శించారు. తెలుగులోనూ ఈ మూవీ విడుదలైంది. శ్రీనాథ్ రాజేంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో శోభిత ధూళిపాళ హీరోయిన్‌గా నటించింది. ఇటు ఆడియెన్స్, అటు క్రిటిక్స్ నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
కాగా కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 'కురుప్' మూవీ రూ. 50 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేయడం దుల్కర్ ఫ్యాన్స్‌ను ఆనందంలో మునిగేలా చేసింది. తన సినిమా సాధించిన ఫీట్‌ను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా అఫిషియల్‌గా అనౌన్స్ చేశాడు దుల్కర్. ఈ మైల్‌స్టోన్‌ను అందుకోవడంలో తోడ్పడిన అందరికీ అతను థాంక్స్ చెప్పాడు.
స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేసిన అతను, "వావ్!! ఇది చాలా పెద్దది!!! నేను దీన్ని ఏమాత్రం ఊహించలేదు. నిద్రలేని రాత్రులు, అనిశ్చితికి సంబంధించిన లెక్కలేనన్ని క్షణాలు, అనుమానాలు, విపరీతమైన ఒత్తిడి అన్నీ ఫలించాయి. ప్రారంభించినప్పుడు ఈ సినిమాకు మా బెస్ట్ ఇవ్వాలని అనుకున్నాం, మీ అందరూ దాన్ని ఇష్టపడాలని ప్రార్థించాం. మీ అందరికీ కృతజ్ఞతలను మాటల్లో ఎలా చెప్పాలో నాకు తెలీడం లేదు." అని ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు.
1984లో చాకో అనే ఫిల్మ్ జర్నలిస్ట్‌ను హత్యచేసిన అభియోగాన్ని ఎదుర్కొన్న కేరళకు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుకుమార కురుప్ జీవితం ఆధారంగా 'కురుప్' మూవీ రూపొందింది. దుల్కర్ సొంత నిర్మాణ సంస్థ వేఫేవర్ ఫిలిమ్స్, ఎం-స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి.
![]() |
![]() |